మనసు పలికే
మనసు పలికే
కత్తులే విసురుతున్నవి..నీ చూపులే విసరక..!
ఈ గుండెను కోస్తున్నవి..నొప్పిమటుకు తెలియక..!
నా ఒళ్ళే నాకు బరువు..గంపెందుకు తలపై..
ఉన్నపేరు చాలుచాలు..తోకలు తగిలించక..!
ప్రేమించా నన్నావే..అబద్ధమా నిజమా..
ప్రేమన్నది అసలు దగా..ఎదుటపడక నవ్వక..!
రమ్మనగానే చెప్పిన..తోటకు వచ్చానే..
దయాప్రసాదం ఏదో..వడ్డించగ చూడక..!
సమాధిలో ఉండాలని..అనిపిస్తే మంచిది..
రాలే పండుటాకుతో..సంభాషణ ఆపక..!
సముద్రంలో ఒకపడవన..పయనంలో జ్ఞానం..
మాయమైపోకు చెప్పక..ముక్కుపిండి ముంచక..!

