మనసు పెట్టి వినుమ
మనసు పెట్టి వినుమ
పసిడిపూల తోట భక్తి నిండిన మది..
అరకనుల నిలచిన అందు శక్తి..
ముక్తియనెడు ఫలము ముచ్చటగా నంద..
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!
ఇసక నుండి పసిడి ఎందుకో లాగుట.?!
ఇంటనున్న నిధిని ఎఱుగలేక..
పసిడిపసిడి యనుచు పరుగు లెచ్చటికోయి..
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!
పసిడి లేని కణము ప్రకృతిలో లేదోయి..
పరమశాంతి నిచ్చు ప'వనమందు..
పావనముగ మునుగ భావమ్ము పూర్ణమౌ..
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!
మట్టి నుండి పసిడి పట్టితీయగ నేల..!
గాలి నుండి పొందగల్గ లేక..!
కాంతి నుండి అంద..కనులు..మూయగలేక..!
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!

