STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు పాడుతున్న గీతం

మనసు పాడుతున్న గీతం

1 min
4

మనసు పాడుతున్న గీతి..ఒదిగే'నా మాటలలో..!

అసలు ప్రణయభావమేదొ..ఇమిడే'నా మాటలలో..!


మౌనమెంత మధురమంటె..పెదవికెలా తెలుస్తుంది.. 

హృదయభాష వెలుగన్నది..కురిసే'నా మాటలలో..! 


చెలిచూపుల తేనియలకు..సాటివచ్చు మధువేదో.. 

విరహవీణ ఆవేదన..పొంగే'నా మాటలలో..! 


ప్రతి కణమున మహాదివ్య..లోకమొకటి ఉన్నదిలే.. 

చూడగల్గు కంటివిలువ..అందే'నా మాటలలో..!


స్వేచ్ఛలేని స్వాతంత్య్రం..ఉండి ఉద్ధరించునెలా..

విశ్వమైత్రి సాధించగ..కుదిరే'నా మాటలలో..!


హృదయవేణు ఊదుతున్న..మాధవుడే విభుడు 

ప్రతిమనసొక రాధయె కద..నిండే'నా మాటలలో


Rate this content
Log in

Similar telugu poem from Romance