STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు మాట

మనసు మాట

1 min
1

తాను ఎలా ఉంటుందో.. చూడకుండ ఏం చెప్పను..!?

ప్రేమ ఎలా ఉంటుందో.. తెలియకుండ ఏం చెప్పను..!?


మధురప్రణయ తాపాలను..రాశిపోస్తె ఏమౌనో..

గజల్ ఎలా ఉంటుందో..వ్రాయకుండ ఏం చెప్పను..!?


కవ్వించే అక్షరాలు..లేవు కదా గమనిస్తే..

మనసు ఎలా ఉంటుందో.. ఇవ్వకుండ ఏం చెప్పను..!?


కనులతోట కలలకేమొ..తప్పవాయె దోబూచులు..

సత్యమెలా ఉంటుందో.. అందకుండ ఏం చెప్పను..!?


రాలిపోవు నీలాలతొ..కర్మలసలు రాలాయా..

వెలుగు ఎలా ఉంటుందో.. పొందకుండ ఏం చెప్పను..!?



Rate this content
Log in

Similar telugu poem from Romance