చెలియ జన్మ చెలికత్తెలు
చెలియ జన్మ చెలికత్తెలు
వనిత సిగను అలంకరించి
వగలు పోతున్న
కుసుమాల సమూహమా!
మగువ సొగసుని మరింత మెరిపించి
చిరుగర్వం ప్రదర్శించే
సువాసనల బృందమా!
చెలియ జన్మ చెలికత్తెలు మీరేవని
గ్రహించానులే!
సఖి మనసు మనోరంజనకు
నిత్య అతిదులు మీరేనని
అంగీకరిస్తానులే!
జన్మ ఆహ్వాన తొలిపత్రికలు మీరే
నిస్క్రమిస్తే వీడుకోలు
ఆకరి పానుపు అలంకరణ మీరే,!!

