ప్రేమ లేఖ
ప్రేమ లేఖ
ఎదురు చూస్తూ ఉంటినోయీ..ప్రేమ లేఖల సాక్షిగా'నే..!
మనము కలసిన తీర మందే..హంస లేఖల సాక్షిగా'నే..!
కలల అలలకు రూపమిస్తూ..రెప్ప వాల్చని దేవినయ్యా..!
అక్షరాలకు ఎలా తెలియును..?! స్నేహ లేఖల సాక్షిగా'నే..!
ఎగురుతున్నవి ఆశలన్నీ..పక్షి పాటల సుధల మాదిరి..!
రాశి పోసిన రాశులివిగో..జన్మ లేఖల సాక్షిగా'నే..!
తెలుప లేనే పలుకులందున..తేనెలొలికే నీదు చూపును..!
మరుగు చున్నవి వలపులెన్నో..మరుల లేఖల సాక్షిగానే..!
ఎదను పొంగే వేదనేమో?!..మూలమేదో అందలేకే..!
ముక్కలైనవి తలపులన్నీ..విరహ లేఖల సాక్షిగా'నే..!
సిరా ఎందుకు..కలమదెందుకు.?! చెలిమి లోతును..పలుకనేలా..!?
తెలియలేకే సంపుటాలుగ..మధుర లేఖల సాక్షిగా'నే..!

