అల్లరి చినుకు
అల్లరి చినుకు
అల్లరి చినుకా తుంటరి పిడుగా
చల్లని సెగతొ మేనిని గిల్లకా,!
నేను పచ్చని వయసుని
పచ్చిక సొగసుని,!
నా పరువపు నిగ నగ లను
ని తడి అద్దముతో పరులకు చూపకు,!
మది మందిరమున
గుడి గుండెల్లో నిలిచుండే
నా జత కాబొవు
పతి రామునికే!
ఈ వయసు వలపు
సొగసు అట్టి పెట్టాను సుమా,!!

