మనసా
మనసా
మారలేదు బంతి మారలేదుర బ్యాటు.!
మారలేదు మనిషి మారలేదు..!
ఆటనాట లాగ నాదరించు టెపుడు?!
మనసు పెట్టి వినుము మనసా
వెంటపడెడు గుణమె వేదింపు ఎపుడైన.!
వాదనలకు చోటు వలదు చూడు..!
జన్మగుట్టు తెలియ జాగృతి కావలెన్.!
మనసు పెట్టి వినుము మనసా
చిత్రమైన తనువు చిన్నారి హరివిల్లు.!
ఎపుడు మాయమగునొ ఏల తెలియు.?
కలదు జ్ఞాన మనగ కనుల లోగిలిలోన.
మనసు పెట్టి వినుము మనసా
మధురమైన దొకటె మౌనమైన మనసు.!
ప్రేమమంత్ర మనగ పెద్ద మనసు..!
నిత్యవేద మనగ నిర్మల మానసం.!
మనసు పెట్టి వినుము మనసా
చింతలేని చిన్ని చినుకు తల్లిరొ భూమి.!
కన్నతండ్రి యనగ గగనమేను..!
అందమైన జన్మ హరివిల్లు గాకేమి..!?
మనసు పెట్టి వినుమ మనసా
కలతలేని చినుకు కాంచుట కష్టమే.!
సౌఖ్యమైన చినుకు సంపదౌను..!
స'రసమైన చినుకు సత్సంతతి యగును.!
మనసు పెట్టి వినుము మనసా
ఒక్క చినుకు తాక ఓదార్పు మొక్కకు.!
కంటిచుక్క జార కడలియౌను..!
నీటిపరుగు మాటు నిత్యమౌ ప్రేమయే.!
మనసు పెట్టి వినుము మనసా
నాట్యమాడు మబ్బు నదులదారి నడుగు.!
భాస్కరుండు తాక వర్షమౌను..!
హర్షమెల్ల చాటు హరివిల్లు రూపెత్తి.!
మనసు పెట్టి వినుము మనసా

