కడలి
కడలి
కడలి ఎలా..అలిగేనో తెలియదులే..!
నువు చూడక మనసు ఎలా..మరిగేనో తెలియదులే..!
ఈ కాలం పెదవులపై..కావ్యమెలా వ్రాయాలో..
నువు తెలుపక కలము ఎలా..కదిలేనో తెలియదులే..!
విరహానికి మన ఊసుల..నైవేద్యం కావాలట..
నువు పలుకక మధువు ఎలా..అందేనో తెలియదులే..!
తెలిమబ్బుల గుంపేదో..బ్రహ్మరథం పట్టేనట..
నువు నవ్వక మెఱుపు ఎలా..విరిసేనో తెలియదులే..!
కోటి నదుల సంగమమే..గుండె పాట అయినవేళ..
నువు తలచక వలపు ఎలా..దొరికేనో తెలియదులే..!

