మనసు శిలయె
మనసు శిలయె
నీ ప్రేమకు పరవశించి మనసు శిలయె కరిగెనోయి..!
నిను చూడగ ముచ్చటతో కలువ కలయె విరిసెనోయి..!
జన్మ మూల మెరుగలేక..భయం నీడ నేనుంటే..!
అనుమానపు కొండచిలువ..వెర్రి తలయె పగిలెనోయి..!
ప్రేమలేఖ దొంతరలకు రెక్కలొచ్చి ఎగురసాగె..!
ఎదలోపలి కోరికలవి..తీపి వలయె విసిరెనోయి..!
మరుల వీణ మీటుచున్న దొర నీవని తెలియగానె..!
ప్రణయ దీప శ్వాస కనుల..అమృత జలయె కురిసెనోయి..!
నీ చూపుల మహిమదేమొ..అక్షరాల కొదిగేనా..!
మైత్రి శంఖ నాదముతో..హృదయ లయయె మురిసెనోయి..!

