నీ నవ్వు
నీ నవ్వు
నిజం చెప్పనా బావా....
నీ ముఖం చూస్తూ ఇలాగే ఉండిపోవచ్చు
నీ నవ్వు చూస్తూ కాలం మరచిపోవచ్చు
నీ భుజమే నాకు ఆసరా ఎప్పుడూ ఇలాగే అందించు
అలిసినపుడు వాలిపోయి నే సేద తీరొచ్చు
నే అలిగినపుడు నను బుజ్జగించుకోవచ్చు
నువ్వు పక్కనుంటే ఆకాశమే అందిరావచ్చు
నువ్వే లేకుంటే శూన్యమే తోచొచ్చు
అందుకే ఎంచక్కా నన్ను అంటిపెట్టుకునే నువ్వుండొచ్చు...

