ప్రేమ
ప్రేమ
ప్రేమ ఒక అందమైన ఊహైతే
ఆ ఊహకి ఊపిరి నువ్వు !!
ప్రేమ ఒక మధురమైన భావనైతే
ఆ భావానికి భాషవు నువ్వు !!
ప్రేమ ఒక చక్కనైన కావ్యమైతే
ఆ కావ్యానికి ప్రేరణ నువ్వు !!
ప్రేమ ఒక కమ్మనైన కలైతే
ఆ కలలో కల్పనవి నువ్వు !!
ప్రేమ ఒక తియ్యనైన తలపైతే
ఆ తలపులోని చిలిపితనం నువ్వు !!
ప్రేమ నా మది పలికే రాగమైతే
ఆ రాగాన్ని పలికించే స్పందనవి నువ్వు !!

