ఆవేధన
ఆవేధన
సొంతమైన దసలేమిటొ..తెలియకనే ఆవేదన..!
ఆనందపు చిరునామా..అందకనే ఆవేదన..!
చెలియ,చెలిమి విడివిడిగా..లేవన్నదె సత్యమోయి..
గుణాతీత గుణరాశిని..చూడకనే ఆవేదన..!
పూలతోట లెన్నున్నా..ప్రేమపూల వనం మనసు..
కణకణమున దివ్యజగతి..తోచకనే ఆవేదన..!
కర్పూరపు దీపం మసి..మరి చల్లని కాటుక కద..
పెనుచీకటి మూలమేదొ..పట్టకనే ఆవేదన..!
విశ్వమోహనుడు ఎవడో..లేడుచూడు జగములేల..
అంతరంగ ప్రపంచాన్ని..చుట్టకనే ఆవేదన..!

