మనసైతివి
మనసైతివి
మనసులోని మనసైతివి..మరచుటన్న మాటలా..!
శ్వాసపూల వాగైతివి..వీడుటన్న మాటలా..!
ప్రేమకెవరు చెప్పగలరు..నిర్వచనం ఏమిటో..
ఎదలోయల వనమైతివి..చూపుటన్న మాటలా..!
విరహమనే భావనమే..దరిచేరగ లేదహో..
నా పాటల యేఱైతివి..ఆపుటన్న మాటలా..!
వేదనకో మాధుర్యం..ఉందన్నది తెలిసెలే..
ప్రణయామృత తరువైతివి..చూచుటన్న మాటలా..!
ఏకత్వపు లోగిలియే..బహుమతిగా దొరికెలే..
స్నేహానికి ఇల్లైతివి..కట్టుటన్న మాటలా..!
మౌనమైన మెఱుపుతీగ..శిల్పమెంత దివ్యమో..
శివమోహిని నవ్వైతివి..చెక్కుటన్న మాటలా..!

