సుందరిరో
సుందరిరో
నాలోపలి బెంగలన్ని.. తీర్చుచున్న సుందరిరో..!
తల నిమురుచు వెన్నుతట్టి.. నడుపుతున్న సుందరిరో..!
బొమ్మగీసి చూపమంటె..చిక్కలేదు నా కంటికె..
నా తనువున కణకణమును.. ఏలుతున్న సుందరిరో..!
వేనవేల సెలయేఱుల.. పాటమాటు మౌనవీణ..
నా పదముల నర్తనములు..మలచుచున్న సుందరిరో..!
తేనె దారమొకటి సరిగ..అందించెను నా మనసుకు..
ఆక్షరాల భావార్తిని..కురియుచున్న సుందరిరో..!
ఏ కంజిర పిలుపుకైన..స్పందించును సుస్వరమై..
జగమంతా చెలిమిసిరులు..నింపుతున్న సుందరిరో..!

