నీలిమబ్బునీడలోనే
నీలిమబ్బునీడలోనే
నీలిమబ్బుల ఆకాశం క్రింద
గగనాన్ని తాకాలనే ఆరాటంలో
ఉవ్వెత్తున ఆత్రం తో ఎగిసి పడుతున్న
నీలి సంద్రపు ఆతృతలో....
నన్నే చూసుకుంటున్న...
మనం పంచుకున్న
మధుర జ్ఞాపకాల జాడల్లో
ఒకనాడు ...
విరిసే వెన్నెల జల్లుల్లో
మెత్తని ఇసుక తిన్నెల్లో
మృదువైన వెచ్చనినీచేతిలో
చేయి వేసి నడుస్తూమాటలోని
భావాలతో హృదయాలను
మీటే వీణ రాగం పాడుకుంటూ
మౌనమే మాటౌతూ
తనువుల తమకపుసరాగాల
తాదాత్మ్యం లో విహరిస్తూ
మెత్తగా విచ్చిన
వెన్నెల కలువను నేనై
వెలుగుల రేడువు నువ్వై
అలసిపోనిఆనందాల సంగమమే మనమై
సుదూర తీరాల్లో
కలవకపోయిన, కలసినట్లు గా
కనపడేసరళ రేఖలమై
మది భావాల సందళ్ల మై
మమతల పందిల్లమైఅల్లుకుంటూ
అలవికాని ఆనంతకాలల్లో
ఎప్పటికి నిలిచిపోయే
చెక్కుచెదరని ఆత్మల
సంగమమై నిలిచిపోయామని
మదిలో మనమనకున్న వెన్నెల బాసలు
ఎద ఎందుకనో మళ్ళీ మళ్ళీ
నెమరేసుకుంటు కళ్ళముందు
చిత్రాలను చిత్రీస్తోంది
నింపాదిగా నిన్నేకన్నుల్లో నిలుపుతూ....
సంద్ర లోని అలల తీరునే హృది సంద్రంలో
నీ తలపుల అలలే
చేరువ అవుతూ ఎందుకనో
దూరమే అవుతున్నట్టు
మనసు మౌనంగానే అదుముకుంటోంది
నువ్వు దూరమైన అనవాళ్లను మరింత దగ్గరగా
జ్ఞాపకాల పేటికలో భద్రపరుస్తూనే .....!!

