ప్రేమమూల
ప్రేమమూల
ప్రేమమూల మెక్కడుందొ.. చెప్పాలని చూస్తున్నా..!
నా శ్వాసల కోవెల నిను..నిలపాలని చూస్తున్నా..!
లేఖలెన్ని వ్రాసానో తృప్తి లేక దాచేసా..!
కలనైనా నీతోనే..గడపాలని చూస్తున్నా..!
మూతపడని నా కన్నుల..నీ రూపం చెదిరిపోదు..!
నీ ఒడిలో..పసి పాపగ..అవ్వాలని చూస్తున్నా..!
ఆ సీతాకోకచిలుక లేమి చెప్పగలవు చెప్పు..!?
నీ వలపుల వానలోన..తడవాలని చూస్తున్నా..!
మోడులైన తలపులకే ప్రాణమూదు ప్రియ రసికా..!
నీ చల్లని చేతులలో..వాలాలని చూస్తున్నా..!
నా కోర్కెల శంఖాలను పూరించగ జాగేలా..?!
నీ ఆరని సంతకమై..మిగలాలని చూస్తున్నా..!

