నీవే
నీవే
తనువు నాదే.. కానీ దానిలో
అణువణువు మాత్రం నీవే..
ఆటాపాటా నాదే.. కానీ మదిలో
ప్రతీ ఊసూ మాత్రం నీవే..
చందమామ లేని వెన్నెలరాత్రి.
ఆకాశంలో మబ్బుల్లేని వర్షం...
శబ్దమే లేని పిడుగులు..
వర్ణమే లేని ఇంద్రధనస్సు..
పరిమళం లేని మల్లెలు..
రెక్కలు లేని విహంగాలు..
నీవు లేని నేను..
ఆ భావనలను
ఊహించుకోగలనా..

