నాకిలలో
నాకిలలో
వసంతము నాకిలలొ గగనమై పోయింది
నీదైన జీవితం నీరమై పోయింది
వెలుగుతో వెడలేవు చీకటిని విడిచావు
కన్నీటి జీవితం భారమై పోయింది
రావనీ తెలిసినా నీకోసం వేచేను
తీయనీ కలయైన కష్టమై పోయింది
కోకిలా అడిగేను పూదోట అడిగేను
ఏమనీ చెప్పనూ శోకమై పోయింది
కొడిగట్టి.దీపంగ ఎన్నాళ్ళు వెలిగేను
మరణమే ప్రసాదు శరణమై పోయింది

