సఖుడవే నీవు
సఖుడవే నీవు
నాగుండె చప్పుళ్ళ..సఖుడవే నీవు..!
రాగాల ఈ పడవ..మరుడవే నీవు..!
విరహమను అడవిలో..కనరాని కొలను..
చెలి కలువ నలరించు..విభుడవే నీవు..!
సడిచేయు గాలితో..సమరమే తీపి..
నాప్రణయ భావనల..వరుడవే నీవు..!
వేదనకు రూపమది..ఇచ్చుటే వెర్రి..
నామోహ తీర్థాల..హరుడవే నీవు..!
గురిలేని తనమేదొ..నిలుపుకో లేను..
పరితాప మణగించు..ప్రియుడవే నీవు..!
దరిచేరగా రావు..పాల మేఘమవు..
ఈ దీప ప్రాణాల..హితుడవే నీవు..!

