STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆనందం

ఆనందం

1 min
359

నీ నవ్వుల వెన్నెలలో విహరించుట ఆనందం..!!

నీ చూపుల పానుపులో పవళించుట ఆనందం..!!


అందమైన నీ మౌనం అద్భుతమే ఓ చెలియా..!!

నీ వెచ్చని అడుగులలో పయనించుట ఆనందం..!!


ఏమైనా ఎపుడైనా నీ తోనే జీవితమే..!!

నీ తియ్యని తలపులలో పులకించుట ఆనందం..!!


నీ మువ్వల సవ్వడికే ఓ సాక్షిగ నిలిపేవా..!!

నీ వాడని వలపులలో లాలించుట ఆనందం..!!


నా హృదయపు కోవెలలో ఆ జ్యోతివి నీవేగా..!! 

నీ అద్భుత కాంతులలో క్రీడించుట ఆనందం..!!


Rate this content
Log in

Similar telugu poem from Romance