రెండు అక్షరాల
రెండు అక్షరాల
"మాట"
పేరుకి రెండు అక్షరాలే కానీ ఆ మాటలోన
దాగివున్న మాయదారి మాయలెన్నో దూరం చేసేది
ఈ మాటే ఈ మాటే ఒక్కోసారి మనిషి ప్రాణం తీసేది
ఈ మాటే మమతను పంచేది ఈ మాటే మనసును చంపేది
ఈ మాటే తోడుగా నిలిచేది ఈ మాటే
మనసుని మనసుని దగ్గర చేసేది ఈ మాటే
మనిషిని మనిషిని మనిషికి ప్రాణం పోసేది
ఒంటరిని చేసేది ఈ మాటే
రెండు వైపులా పదును వున్న చుర కత్తి ఈ మాట
అన్ని వైపులా తీపిని దాచుకున్నదీ మాట తలుచు కుంటే
ఒక మాటతో శాంతిని స్థాపించ గలవు లేదంటే ఒక మాటతో
విలయం సృష్టించ గలవు
అందుకే ఈ మాటను పదిలంగా చూసుకో
వాడే ప్రతి మాటను మంత్రం లా వాడుకో

