కళ్ళు
కళ్ళు
నీవెప్పుడు మాట్లాడినా కదిలే నీ పెదవుల వైపు చూడను,
నీ కళ్ళలో మెదిలే నీ మనో భావాల్ని కళ్ళతోనే చదువుతుంటాను
నా మీద ప్రేమ ఉందా అని ప్రశ్నిస్తే కనులు మూసుకొని
మౌనం వహిస్తే ఎలా
మనసులో ఎగసిపడే భావ తరంగాలను కళ్ళలో
ప్రదర్శించేందుకు జంకు ఎందుకు
నీలి కన్నులపై రెప్పల పరదాలు వేసి నీ ప్రేమను దాచడమెందుకు
ఆ ప్రేమ గవాక్షాల తలుపులు నెమ్మదిగా తెరుచుకోనీ నీ కంటిలోని నా రూపుని ఈ లోకం చూడనీ
నీ కళ్ళు చెప్పే" ప్రేమవేదాన్ని" అంతా మనసారా విననీ...

