బంధం
బంధం
ఇష్టానికి కారణం దొరకనప్పుడు..
బంధానికి విలువ లేనప్పుడు..
పరిచయం చులకనైనప్పుడు..
నువ్వెక్కడున్నావ్ అని
నీ మనసుని అడగమాకు.
అది నిన్ను చూసే చూపుల
అర్థాల బడబాగ్నిలో
అభిమానం తగలెట్టి ఒంటరిగా నిన్నొదిలేసి
వెళ్తుంది.
కొత్త పాతలు వస్తువుల్లో వెతకాలి.
పూసే పువ్వుల్లో కాదనే అర్థం
ఏ పుస్తకంలో రాసారో..
పేజీల్లేని జీవితాల్లో అంటిస్తే బావుండు

