ఓ నేస్తం కావాలి
ఓ నేస్తం కావాలి
మాటైనా పాటైనా..తియ్యంగా ఉండాలోయ్..!
ఊరైనా వాడైనా..చల్లంగా ఉండాలోయ్..!
లాభాలో నష్టాల్లో..కష్టాలే పాఠాల్లే..
పాలైనా నీళ్ళైనా..సాయంగా ఉండాలోయ్..!
ఆకాశం చూశావా..నవ్వేనా ఇంతైనా..
తప్పైన ఒప్పైనా..మెల్లంగా ఉండాలోయ్..!
భావాలే మేఘాలై..కమ్మేనా వెచ్చంగా..
ముద్దైనా ముగ్గైనా..అందంగా ఉండాలోయ్..!
రాగాలో భోగాలో..త్యాగాలే చిత్రాలే..
నీడైనా తోడైనా..దివ్యంగా ఉండాలోయ్.

