అద్భుతముగ
అద్భుతముగ
నెమ్మదిగా పడేవాన..ఇంకునుగా అద్భుతముగ..!
మనసు నిదానిస్తె..ఉండునుగా అద్భుతముగ..!
అనుభవాల పాఠాలను..మరువకున్న మేలుకదా..
అందమైన జ్ఞాపకాలు..కాల్చునుగా అద్భుతముగ..!
కడలి ఎంత దైతేనేం..దాహాన్నే తీర్చనపుడు..
విరహమనే భావన'మది..పేల్చునుగా అద్భుతముగ..!
మేఘమెంత నల్లనిదో..కురియతగిన వేళైనది..
చినుకుపూల రాగమేదొ..పొంగునుగా అద్భుతముగ..!
పొడిగొంతున ఉన్ననేల..తడిచేసే వారెవరో..
దు:ఖానికి ఆనకట్ట..వేయునుగా అద్భుతముగ..!

