ఆ కళ్ళు....
ఆ కళ్ళు....
ఆ కళ్ళు.......!!!
అరవిరిసిన కలువ పువ్వులు..!!
అమవస నిశిలో చంద్రలేఖలు..!!
అపుడే విరిసిన పున్నాగలు..!!
అందమైన కలలకు నిలయాలు..!!
తీరని కోరికల లోగిళ్ళు..!!
మనసును మాయచేసే హేమంతాలు..!!
సాయం సంధ్య సింధూర వర్ణాలు..!!
కోటి భావాలు పలికించే
అపురూప భావతరంగాలు..!!
మదిలో అనునిత్యం సందడి చేసే
ఆమని కోయిల గానాలు..!!
అలసిన మదిని ఊరడించే మరు మల్లెల అరవిందాలు..!!
అలుముకున్న చీకటిలో దారి చూపే వెలుగు రేఖలు..!!!!!!!!

