మనసు లేక
మనసు లేక
చీకటెంత వెర్రిదంటె..ఉండ'లేదు మనసు లేక..!
ప్రేమ ఎంత పిచ్చిదంటె..దాగ'లేదు మనసు లేక..!
లేదన్నది లేని చోటె..సుఖశాంతుల కాపురమోయ్..
ఆశ ఎంత గట్టిదంటె..మనగ'లేదు మనసు లేక..!
శ్వాసతోటి చెలిమి గాక..సంపదెక్క డుంటుందోయ్..
స్నేహమెంత మెత్తనంటె..పలుక'లేదు మనసు లేక..!
ఎంత నీతి సూత్రమైన..పాటించే పని నీదే..
చట్టమెంత కఠినమంటె..చంప'లేదు మనసు లేక..!
బంధాలో గంధాలో..మోయలేని రాగాలే..
మోసమెంత గొప్పదంటె..బ్రతుక'లేదు మనసులేక..!

