STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

మనసంతా నువ్వే

మనసంతా నువ్వే

1 min
280

నువ్వు నాక్కనిపించిన మొదటిసారి

తళుక్కుమన్న వెలుగు రేఖలు

నా కనులలో

ఇప్పడికీ కనిపిస్తున్నాయి

నీ మధుర ధ్వనులు వినిపించిన మొదటిసారి

నా మనసులో

మోగిన దివ్య ఘంటికలు

ఇప్పడికీ వినిపిస్తున్నాయి

నా హృదయం మీటిన

కోటి వీణల సవ్వడులు

ఇప్పడికీ నా హృదయాన్ని

స్పృశిస్తున్నాయి

నీ మొదటి పరిశ్వంగం

కలిగించిన పారవశ్యం

ఇప్పడికీ గుర్తుకొస్తోంది

మధురమైన నీ తలపులు

నా హృదయాన్ని స్పృశించినప్పుడు

ఏ దృశ్యం చూసినా నువ్వే

ఏ సవ్వడి విన్నా నువ్వే

నువ్వు మాత్రం

నా నుంచి దూరంగా

నీ స్వాంతనలో నువ్వుంటూ

ఈ ప్రపంచంలో నా ఉనికిని

నిర్లక్ష్యం చేస్తుంటే

మనసు గాయపడి

మళ్ళీ నీ సాంగత్యాన్నే

కోరుకుంటున్నాను



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract