STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

మనోహరం

మనోహరం

1 min
205

నన్ను నేను చెక్కుకునే..ముచ్చటెంత మనోహరం..!

 నీ కోసం వెతుక్కునే..వేదనెంత మనోహరం..!

 నీ చూపుల ధారలలో..ఎన్ని మధుర రాగాలో..

నీ వెంటే నడుస్తుంటె..వేడుకెంత మనోహరం..!

 నీ తలపుల చందమామ..ఊరించుట చూస్తున్నా..

చిరునవ్వులు పూయించే..వెన్నెలెంత మనోహరం..!

 చెలిమిపూల తోటలాగ..ఉంది కదా నీ వలపే..

చిత్రమైన పరిమళాల..ఊయలెంత మనోహరం..!

 యుగాలుగా శిలలాగా..పడిఉన్నది ఈ మనస్సు..

ప్రేమహోమ నిర్వహణకు..భావనెంత మనోహరం..!

 సుస్వరాల సమిధలేవి..మాధవుడా అందుకోర..

మౌనధ్యాన గగనంలో..సాధనెంత మనోహరం


Rate this content
Log in

Similar telugu poem from Romance