మనమే బాలలం
మనమే బాలలం
మనమే మనమే బాలలం.
(గేయం )
మనమే మనమే బాలలం
మనదేలే ఈ భావితరం
చుట్టుప్రక్కల చూసేద్దాం!
చెట్టూచేమలు నాటేద్దాం!
నీటిని తెచ్చి పోసేద్దాం!
బాటను మనమే వేసేద్దాం!
ప్లాస్టిక్కునంతా పారేద్దాం!
నష్టానిప్పుడు తగ్గిద్దాం!
చెత్తను చక్కగ నేరేద్దాం!
సత్తువ తెలిపే పనిచేద్దాం!
స్వచ్ఛతకోసం తపియిద్దాం!
తుచ్ఛపుపనులు మానేద్దాం!
చరవాణిని చూడొద్దందాం!
కరములు కలిపి యాడేద్దాం!
బుద్దిగ బడికి వెళ్లొద్దాం!
శ్రద్దగ పాఠాలు నేర్చేద్దాం!
గ్రంథాలయాలు దర్శిద్దాం!
గ్రంథాలన్నీ చదివేద్దాం!
వ్యాయామాలను చేసేద్దాం!
ఆయుష్షునెంతో పెంచేద్దాం!
అమ్మ మాటలను వినేద్దాం!
కమ్మని కబుర్లు చెప్పేద్దాం!
మనమే మనమే బాలలం!
మనదేలే ఈ భావితరం!//
