Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Phanikiran AK

Others Children

4  

Phanikiran AK

Others Children

కార్పొరేట్ మాయ

కార్పొరేట్ మాయ

1 min
324


పలకా బలపం


మ్యూజియం చేరాయి ..


సెల్ ఫోన్, ట్యాబు లు


చిట్టి చేతుల్లో అమరాయి


న్యూస్ పేపర్ అట్టలు


కనుమరుగయ్యాయి


ప్లాస్టిక్ అట్టలు


సౌకర్యం అయ్యాయి



అంశానికో రాత పుస్తకం పోయింది


అవసరానికి మించి లెక్క చెప్పి


కొట్టువాడికి లాభం తెచ్చింది


వృక్షాలు కాపాడండి అనే పాఠం


పుస్తకాలకే పరిమతమయ్యింది .



పెద్దలు చెప్పే నీతి పద్యాలు


పిల్లలకు దూరం అయ్యాయి


నీతి శతకాలు


పుస్తకాన చేరాయి


వల్లే వేసే విధానం మాయం అయ్యింది


ముక్కున పట్టే పద్దతికే ఓటు పడుతోంది



టెక్నాలజీ పేరు చెప్పి


ఈ పుస్తకం తెచ్చింది


మృత భాష లిస్టులో పలుకే కాదు


లిపి కూడా చేరింది .



విద్యకు అందరూ సమానం అని


యూనిఫామ్ కోడ్ వచ్చింది


ఎక్కడా దొరకని రంగులతో


లాభాలు పొందింది



అందిస్తాం అన్నీ అంటూ


జీవితాలకు సంకెళ్లు వేస్తోంది .


కార్పొరేట్ మాయ


పసితనాన్ని సైతం కబళిస్తోంది .


*********%%%%%%%**********


ఫణికిరణ్@కిరణ్మయిఅనిసింగరాజు.


Rate this content
Log in