STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

మనిషి

మనిషి

1 min
189


కాలమనే గాలానికి చిక్కుకున్న మనిషీ 

విదిలించుకొ నిర్వేదం ముసురుకున్న మనిషీ 


ఎవరికోసం ఎందుకోసం సంపాదన సమరం

పైకిచూడు కోరికలలొ కూరుకున్న మనిషీ 


ఎన్నాళ్లని బ్రతుకుతావు ఎందుకంత ఆతృత

విశ్వశాంతి విధ్వంసం కోరనున్న మనిషీ 


అందనివైనాగానీ అందాలని కోరకు

దురాశంటి శిఖరాలను చేరుకున్న మనిషీ 


కల్తీలతొ సంపాదన పరమావధి నీకూ 

ప్రాణాలతొ చెలగాటం ఆడుతున్న మనిషీ


Rate this content
Log in

Similar telugu poem from Classics