మనిషి ధర్మము
మనిషి ధర్మము
ఏది నిత్యము..ఏది సత్యము తెలుసుకొనుటే మనిషి ధర్మము..
మరీచికయే నిలుపు ప్రాణము?! భ్రాంతి చెందుటె మనిషి కర్మము
మెరుపుకలలేశాశ్వతమ్మనినమ్మియుండునుచలితహృదయము ఆయువన్నది వానరాకడ,తిరిగి పోవుటె దైవ మర్మము..
మాటలన్నవి నీటి మూటలు, వ్యర్ధమేగా పనులు చేయక
పరులసేవే ప్రాణ సమమని తెలియచేయుటె జనులకు హితము..
రాలిపోయే పువ్వుకెందుకొ నవ్వువిరిసెను రేపు లేదని...
భోగభాగ్యములెన్నినాళ్ళను తెలివికలుగుటె బుధుని వినయము..
విషాదాశ్రువులెన్నిరాలిన,కలలముసుగులు ఎన్ని తొలగిన,
ఆశయన్నది తగని కోరిక, మౌనియవుటె జీవి నియమము..
