STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

మనిషెందుకు

మనిషెందుకు

1 min
2

స్నేహానికి కేతనమై..నిలువలేని మనిషెందుకు..!? 

మతంమత్తు సరిగ పట్టి..కాల్చలేని మనిషెందుకు..!? 


నీతి అనేదేదైనా.. ఆచరించి చూపాలోయ్.. 

నవనీతపు లక్షణమే..అందలేని మనిషెందుకు..!? 


ఖరీదైన మేడవుంటె..నిద్రపట్టు వీలుందా.. 

దివ్యభోగ రహస్యాన్ని..తెలియలేని మనిషెందుకు..!? 


మాటలతో తూట్లుచేయు..వారలదేం గొప్పతనం.. 

పరమాద్భుత మౌనంలో..మునగలేని మనిషెందుకు..!? 


చదువుండీ జ్ఞానమింత..కలుగకున్న లాభమేమి.. 

అహంకార సామ్రాజ్యం..వదలలేని మనిషెందుకు..!?


Rate this content
Log in

Similar telugu poem from Classics