మంచు వానలా...
మంచు వానలా...
మనసున మరువము సువాసనలేల...
తనువున పన్నీటి జల్లులేల...
నిను తలచిన చాలు...
మానసానా మంచు వానలు...
దేహమున సుగంధ పరిమళాలు...
మరి నీవే చెంత చేరిన సమయాన...
ఏమగునో అని ఒకటే ఉలికిపాటు...
నీ రాకకై వేయికన్నుల వేచియున్నా...
నీసేవలో తరించ వేదిక సిద్దము చేసా...
ముచ్చటతీర తీరిక చేసుకోవయ్యా..!!

