మంచితనం
మంచితనం
మంచితనం నచ్చుతుంది
మాట నచ్చినంతవరకే
మాట నచ్చలేదా
మన మంచితనం చచ్చిపోతుంది
ఒక్క మాట ఎదుటి వారిలో
మనలను మెచ్చుకునేవారిలో
తప్పుంటే ఎత్తి చూపగానే
విచక్షణ మరచిన కోపానికి
వివేకం కోల్పోయిన వాదానికి
మనలో ఎంత నిజాయితీ ఉన్నా
మనమెంత సర్దుకుపోయినా
స్నేహం శతృవై ధూషణ మొదలైతే
మంచిని గ్రహించలేని మూర్ఖత్వం
నాదే నిజమని చాటుకుంటే
అందుకే తెలిసినా తప్పని చెప్పకు
మూర్ఖత్వం నిండిన మనుషులతో వాదించకు...
