Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

మన కవులు

మన కవులు

1 min
219


. భారతి దేవి పుత్రులగు వాల్మికి వ్యాసుడు కాళి దాసులున్

. భారవి మాఘ శూద్రకుల పాణిని ముఖ్యుల మార్గమందు చున్

. సారమహా సుధాఝరిగ సాహితి ధారలు పొంగి పొర్ల మా

. భారత తత్త్వసత్త్వమది బంగరు జిల్గుల తేజరిల్లగన్.

. భారతమున్ తెలుంగునను వ్రాసెను నన్నయ భాషకాద్యుడై.

. మారన పోతనార్యులును మాన్యులు తిక్కన యెఱ్ఱనాదులున్

. సూరన కృష్ణ రాయలును సోమన పెద్దన మల్లినాథులున్

. జేరి యశంబు నింపిరట చెన్నుగ వెల్గెడి తెల్గు భాషకున్.//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational