Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

మన భారత శాస్త్రవేత్తలు

మన భారత శాస్త్రవేత్తలు

1 min
254


. నారము తోడ యోగులిట నవ్యపు శోధన జేసినారు సం

. సారపు వృద్ధికై సతము శాస్త్ర రసాయన వైద్య విద్యలన్

. దారిని జూపుచున్ భువికి ద్రష్టలుగా ఘనతన్ వెలింగి రా

. తారక రాశివోలె వసుధైక కుటుంబపు మేలు గోరుచున్

. చేరి జయంబు పొందుచును శ్రీకరమైన యశంబు కల్గగా

. నా రవి నిల్చు దాక దిశ లందున వెల్గును దేశ కీర్తి మా

. భారత శాస్త్ర వేత్తలిట భవ్యజగానికి బాట వేయగా 

. మారెను జీవనంబు మహిమాన్వితమౌ బహు శాస్త్ర విద్యలున్

. నేరిచి శాస్త్ర వేత్తలిట నేర్పుగ సల్పగ శోధనల్ భళా!

. తారల పైకి సాగెదరు దారులు వేయుచు నంబరమ్ములో

. ఆ రవి మండలంబు దరి నద్భుత యానము జేయు వారలై.//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational