మళ్ళీ ఎప్పుడు కలుద్దాం ..!
మళ్ళీ ఎప్పుడు కలుద్దాం ..!
చూపులతో మొదలైన పరిచయము
స్నేహంతో సాగెను మున్ముందుకు
సందేశాల పరంపర , వారి ప్రేమ రెపరెప
చిలుకై...గోరింకై...దూరతీరాలకు
వేసవిలో ఎత్తెన కొండలు లోయలు
ఉద్యానవనాలు చల్లని గాలులు
ప్రేమతో పులకించే ఇద్దరి తనువులు
అందాలతో పరవశించే మనసులు
ఎన్నో కథలు మరెన్నో ఊసులు
సమయమేమో గంటలే నిమిషాలు
అమిత ఆనంద అనుభూతులు
సుందర ద్రృశ్యాల చిత్రమాలికలు
మళ్ళీ మళ్ళీ చూసుకోవాలని
మనసు విప్పి మాట్లాడుకోవాలని
జీవితం మధుర స్వప్నంలా సాగాలని
అనేక వసంతాలు పయనించాలని
ఒకనాడు కళ్ళతో కళ్ళు పలికెను
మళ్ళీ ఎప్పుడు మనం కలుద్దామని !
*********

