మల్లెమొగ
మల్లెమొగ
మల్లెమొగ్గ పాడుతున్న..రాగమేగ అనురాగం..!
చెలిచెక్కిలి సిగ్గులలో..మౌనమేగ అనురాగం..!
ఆశపడే ఆరాటపు..వేడుకలో కలలెన్నో..
మాతృత్వపు ఊయల వైభోగమేగ అనురాగం..!
మనసులోని ముచ్చటలను..తిలకించే సందడిలో..
విరహగీత సౌరభాల..గానమేగ అనురాగం..!
భావనలకు సాక్ష్యమైన..వీణ కదా ఈ తనువే..
సమ్మోహన వసంతాల..సరసమేగ అనురాగం..!
ఆదర్శపు రథము నడుపు..ఆశయాల ఛర్నకోల..
కోర్కెచుట్టు అల్లుకున్న..మోహమేగ అనురాగం..!
సత్యమింత నీ గజలున..పొదిగేవో
అక్షరాల వెన్నెలతో..బంధమేగ అనురాగం..!

