STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

మిలమిలలు !

మిలమిలలు !

1 min
249

తళుకులీనుతున్నావే సొగసులతో

బంగరుబొమ్మా ,

మతిపోతోందే నిను చూస్తే ఆ మెరుపులు

నీ పుట్టింటి సొమ్మా !


నడకలో నెమలే నీకు సరిజోడు .

కళ్ళలో కనపడే మిలమిలలే తెలుపును ఈడు .


పారిస్ నుంచే ఏంజెల్లా దిగి వచ్చావా ?

చైనాతో రాయబారిగా పంపబడ్డావా ?

లేక , అమెరికాచే స్వయంగా నాసాలో

రష్యా మెచ్చుకోవాలని చేయబడ్డావా !


ఓహో , భారత్ సంస్కృతినే

నింపుకుంటే నీ వెంటే పడతారని ఇటొచ్చావా !?


ఏమైనా నాదే కదా అదృష్టం .

నీవెక్కడుంటావో చెప్పవా నిత్యం వస్తా నీకోసం .

పారిజాతపుష్పాలంటే తెలుసేమో నీకు ,

రోజాలే ఇస్తానని అనుకోకు .

బుట్టలతో అన్నిరకాలు తెచ్చి నీ ఒంటిపై

వర్షంలా కురిపిస్తానులే ,

ధర్మవరం , పోచంపల్లి పట్టుచీరలలో

నీవెంత అందంగానో కనిపిస్తావులే !


అప్పుడు నీ ప్రియుడెవరని ఎవరైనా అడిగితే

నాపేరే చెప్తావులే .

సిగ్గులు మొగ్గలేసి నేనంటేనే తపిస్తావులే !!




ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar telugu poem from Thriller