మీనాక్షీ సుందరేశము
మీనాక్షీ సుందరేశము


నడిరేయి నను చూసి నవ్వుతావెందుకు?
రస సంగరమున రసేశ్వరుడు సుందరేశ్వరునికి సమ ఉజ్జియై చెలరేగి
కామోద్దీపనమున స్పందించిన ఆణువణువూ ఝంఝామారుతమై
తనూసాగరమునూప చెలరేగిన రత్యేచ్ఛా కెరటములతో
పోటీ పడుచు ఎగసి పడుచున్న వక్షద్వయమును
అధ్యక్షించిన స్వామి మీనాక్షీదేవి అభీష్టమును తీర్చిన పిదప
రమణి శాంత చిత్తయై సుఖానుభూతిని ఆస్వాదించుచున్న వేళ
మాతృత్వ చిహ్నములు, మంగళ సూత్రముల వహించి
నెమ్మదిగా ఎగసిపడుచున్న ప్రేయసి పాలిండ్లను చూచి
క్షణము క్రిందట వాటి ఊపులు ఊయలలు గుర్తుకు వచ్చి
సుందరేశ్వరుడు తన నెమ్మోమున చిందించెను సుందర దరహాసము
అర్ధ నిమీలిత నేత్రయయ్యు గమనించి మీనాక్షి
వీణా స్వనమున విభుడ నడిగె మత్తుగా
నడి రేయి నను చూసి నవ్వుతావెందుకని