మీ జాతిని
మీ జాతిని
పాలిస్తూ మేలుచేస్తు..పోషింతును మీ జాతిని..!
కబేళాకు పంపిననూ..మన్నింతును మీ జాతిని..!
జన్మనిడిన తలిదండ్రుల..విస్మరించు బుద్ధేమిటి..
ఇంతకన్న పాపమేమి..ప్రశ్నింతును మీ జాతిని..!
నా రుణమును తీర్చుకోగ..జన్మనెత్తు పనేంలేదు..
కన్నవారి తోడుండగ..అర్థింతును మీ జాతిని..!
ఏంచదువులు ఏం ప్రగతిట..పరిశోధన దేనికొరకు..
ప్రకృతిపట్ల కరుణజూప..ప్రార్థింతును మీ జాతిని..!
మట్టి గాలి నీరు నిప్పు..గగనాలను చూడరేల..
అసలుప్రేమ హృదినిచేర..సాధింతును మీ జాతిని..!
పాలుపెరుగు వెన్నెలేల..సేవింతురొ మక్కువగా..
నేతినేతి వాదమెరుగ..నడిపింతును మీ జాతిని.
