STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మెరుపు తీగ...

మెరుపు తీగ...

1 min
381

పాప చెవికి లోలాకులు అధరాలు మాగిన దొండపండ్లు

చెక్కిళ్ళు పలకమారిన మామిడిపండ్లు నయనాలు మిణుగురు దీపాలు

మోము ఎర్రనైన సిమ్లా యాపిల్ మెడలో మంచు బిందువుల హారం

కురులు దట్టమైన కారుమబ్బులు జడలో మల్లెల గుబాళింపులు

నవ్వు సరిగమల గానం మాటలు నయాగర జలపాత జోరు

తనువు సుగంధాల నిధి మనసు పురివిప్పిన మయూరం

నీవు కట్టిన మెరుపుల చీర నింగిలోని ఇంద్ర ధనుస్సు లా   

కళ్ళకు కనువిందు చేసింది నీవల్ల చీరకు అందం వచ్చిందా 

చీర వల్ల నీకు అందం పెరిగిందా సౌందర్యమా ఆమెకు దాసోహమయ్యావా 

సౌందర్యమా నిన్ను ఆమెలో అన్వేషించనా...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance