STORYMIRROR

Jyothi Muvvala

Abstract Action Inspirational

4  

Jyothi Muvvala

Abstract Action Inspirational

మేలుకో

మేలుకో

1 min
273


అమ్మమ్మ కొట్టిందని నాన్నమను చేరిన అమాయకత్వం మనది

ఏదో కావాలని ఇంకా ఏదో పొందాలనే తపనతో

ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అన్న ప్రతి ఒక్కరికి ఓడిని చేర్చుకున్న పెద్ద మనసు మనది 

తప్పులందు మనతప్పులెన్నక ఆడే వైకుంఠపాళీ మన రాజకీయాలది 

వరించిన పదవిని ఒడిసి పడతారు 

విశ్వరూపం చూపిస్తారు !


వారు, వీరు అని తేడా లేక....

గద్దెక్కినంతవరకు సేవకుడిని అంటారు 

గద్దెక్కినాక మనపై ఎక్కి స్వారీ చేస్తుంటారు

నిన్న, నేడు, రేపు తేడా లేదు 

వచ్చేవారు వస్తున్నారు దేశసేవ పేరిట దోచేవారు దోచుకుంటున్నారు 

నలిగిపోయేది మధ్యతరగతి మానవుడు ఒక్కడే!


పథకాల పేరిట ఎరవేసి 

బానిసత్వాన్ని వారసత్వంగా చేసి 

బడా బాబుల బంగ్లాకు దిష్టిబొమ్మలై

ప్రతిపక్షం లేని చదరంగాని ఆడుతున్నారు!


పచ్చ నోటు చూసి పడగ తొక్కారు 

సానుభూతిలో సగం మునిగారు 

బండరాయిని దించాలనుకుని గుదు బండిని నెత్తికెక్కించుకున్నారు 

మేలు మాట దేవుడేరుగు కోల్కోలేని దెబ్బ తగిలి విలవిలలాడేరు !


ఒక్కసారి ఆలోచించండి 

రాజ్యాన్ని పంచుకొనే దాయాదు లేనప్పుడు

తాను చేసిందే శాసనమని రాజు విర్రవీగుతాడు 

తన ఉనికికి ముప్పు ఉందని తెలిస్తే...

 ప్రజలను ఆశ్రయిస్తాడు 

ప్రజాభిమానాన్ని కోరుకుంటాడు 

ప్రజా శ్రేయస్సుకు కాస్తయిన ఆలోచిస్తాడు!


పోటీ లేని రాజు పోతల గిత్తై ఎగిరెగిరి పడతాడు

ప్రజల అండే తనకు శ్రీరామరక్ష అని తెలిసేలా చేద్దాం 

ఆలోచించి అడుగు ముందుకు వేద్దాం

 మన దేశాన్ని మనమే కాపాడుకుందాం !!


- జ్యోతి మువ్వల 


Rate this content
Log in

Similar telugu poem from Abstract