STORYMIRROR

Malleswari Kolla

Drama Inspirational Others

4  

Malleswari Kolla

Drama Inspirational Others

మేలుకో మహిళా!

మేలుకో మహిళా!

1 min
351

తరాలు మారినా, యుగాలు గడిచినా

వంటింటి కుందేలువై మగ్గుతున్న

ఓ మహిళా! లే మేలుకో!

నీ తలరాతని అందంగా 

మార్చుకునే ప్రయత్నంలో

నిన్ను నిర్బంధించే ఆంక్షలను చెరిపేయి

కష్టమొచ్చిందని కలత చెందకు

గరిటె తిప్పే నీ చెయ్యి తలుచుకుంటే

అధ్బుతాలు సృష్టించగలదని గుర్తించు

చూపులతో చంపే గుంటనక్కలున్నాయని

అదను చూసి మాటు వేసే కామాంధులున్నారని

భయపడి వెనకడుగు వేయకు

కలల తీరం చేరే వరకు

అలుపన్నదే దరి చేరనీయకు

మహిళాభ్యుదయమే జగతి ప్రగతికి

మూలమని చాటి చెప్పేవరకు విశ్రమించకు!!



Rate this content
Log in

Similar telugu poem from Drama