మేలుకో హాలికా
మేలుకో హాలికా
ప్రాసాక్షర కవిత
గగ, జజ, డడ, దద, బబ, మమ '.
------------------------------
ఆ'గ'కోయి! హాలికా! అరక బట్టి
సా'గ 'వోయి! సైరికా! సాగు చేసి
ప్ర'జ'ల కింత బువ్వ పెట్టగ పొలము దున్నగా
సు'జ'నుడా!కదిలి చూడవోయి!వేకువను.
గ'డ'గడ వడికే చలిలో
నిలిచి
వ'డ'గళ్ళ వానలో కలిసి
క'ద'లుచు కాయ కష్టము చేసి
ము'ద'ముగ దేశానికి వెన్నెముకవై నిలిచి
క'బ'ళము పెట్టెడి హాలికా!
నిదుర లేచి రమ్ము!
మా' బ'తుకుల కాధారము నీవే!సైరికా!
స'మ'వర్తి సూరీడు తూర్పున చరచరా వచ్చెనిదిగో!
మా 'మ'నసున్న మా రాజా! వేగమే మేలుకొమ్ము!