మదిలోని మాట
మదిలోని మాట


సాకి౹౹
మదిలో మాట రాస్తున్నా ఆలకించవా
అది ఇది అనక ఉత్తరాన్ని పరికించవా
ప౹౹
ఒంటరి మనసు ఆ వయసుతో సాగితే
తుంటరి ఊహే ప్రేమ ఊయల ఊగితే |2|
చ||
తేనె పట్టు మొత్తం పిండి తాగినట్లుందే
కన్నుకొట్టీ సాంతం కౌగిలించినట్లుందే
వెన్నెల్లో కొత్త వేడి ఏదో పుట్టినట్లుందే
సన్నని ఆశే ఒకటి సరసంచేసినట్లుందే |ప|
చ||
తేనెల స్వర్గానివో తీరానికి మార్గానివో
ప్రౌఢిమ కావ్యానికి అష్టవిధ నాయకివో
కలలోకొచ్చే కల్లోలాలు తెచ్చే కలతవో
గుండెల్నే పిండిపిండి పీడించే అలతవో|ప|
చ||
చుక్కల కాంతి ఎంచక్కా పులుమినట్లు
చక్కని రాత్రి చుక్కాణి పట్టి చూపినట్లు
ఎదలో ఎక్కడో పట్టి పట్టీ లాగి పట్టావే
మదిలోన మెదలక గిచ్చిగిచ్చి పెట్టావే |ప|
చ||
తీయని బాధే తీరక పోరుపడినట్లుందే
మారని మనసే ఊరికనే జారినట్లుందే
చేయందిస్తే చేరగిలి హత్తుకున్నట్లుందే
ఆ ఊహే చక్కిలిగిలి చాలపెట్టినట్లుందే |ప|