STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

మదిబావి

మదిబావి

1 min
403

మది బావి


బావిలో నీటిని తోడినట్లు

మనసు లోతుల్లో నుండి 

భావాలను తోడిపోస్తున్నా

నీవు విన్నా వినక పోయినా

చుాసినా చుాడకపోయినా...


ఆగని ప్రేమ ఊటనే

ఊరుతుానే ఉన్నాయి 

తీయని జ్ఞాపకాలకు సాక్ష్యమై

నా కన్నీటి ఊరటై

ఊరిస్తునే ఉన్నాయి మధుర స్మృతులు ...


ఊపిరేదో పోస్తుా

ఉనికి నీకై తెలుపుతుా

ఉసుారు మన్నా

 ఉన్నతంగా నిన్నే చుాస్తున్నా

నీరు గారి పోయిన చీకటి నీడలో నన్నుంచినా...


గుండె గది నుండి నన్ను తోసినా

మరలా పుడుతున్నా

హృదిని దాటని ప్రేమనై

పాతుకుపోతున్నా

మరలిరాని వాస్తవం నేనై....


నా సుందర స్వప్నం నీవే

బ్రతికిస్తుా చంపుతుా

నా మనోధైర్యం నీవే

నా బలహీనత నీవే....


బజ్జో ఈ బుజ్జి మదిలో

గురుతుల్లో ఊయలుాగుతుా నీవు

నీ మెాము చిరునవ్వుకై

సదా వీక్షణలతో అభిసారికనై నేను....


      


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance